తారక్ కు ఛాలెంజ్ విసిరిన మోహన్‌లాల్‌..

SMTV Desk 2018-05-31 11:31:38  mohan lal, mohanlal and ntr, #HumFitTohIndiaFit, ntr

హైదరాబాద్, మే 31 ‌: ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ చేసిన ఛాలెంజ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. రాజ్యవర్ధన్ సింగ్ పుష్ అప్స్ చేసిన వీడియో ను పోస్ట్ చేస్తూ హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌, విరాట్‌ కోహ్లీకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో వారు ఛాలెంజ్‌ను స్వీకరించి, కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ హీరోలు ఎన్టీఆర్‌, సూర్యకు సవాలు విసిరారు. మోహన్‌లాల్‌ కసరత్తులు చేస్తున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రాథోడ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించానని.. సూర్య, తారక్‌, పృథ్వీరాజ్‌ను ఆహ్వానిస్తున్నాని అన్నారు. ఇండియా ప్రజలు ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం తప్పని సరి అని తెలిపారు. మరి తారక్‌, సూర్య, పృథ్వీ ఎప్పుడు ఎలా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారో చూడాలి. ఈ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌ను పలువురు ప్రముఖులు స్వీకరించి కసరత్తులు చేశారు. తమ స్నేహితులకు, సహ నటులకు సవాలు విసిరారు. సమంత, నాగచైతన్య, సుశాంత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, లావణ్య త్రిపాఠి తదితరులు ఛాలెంజ్‌లో పాల్గొన్న వారిలో ఉన్నారు.