ఏపీ రాష్ట్ర పక్షిగా రామచిలుక..

SMTV Desk 2018-05-30 19:23:57  ap state symbols, ap bird parrot, ap new go for symbols, amaravathi

అమరావతి, మే 30 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలును ప్రకటించింది. విభజన అనంతరం అధికారిక చిహ్నాల్లో ఆంధ్రప్రదే‌శ్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక పక్షిగా ఉన్న పాలపిట్టను తెలంగాణ సైతం తమ రాష్ట్ర పక్షిగా గుర్తించింది. దీంతో ఏపీ రాష్ట్ర చెట్టుగా వేప చెట్టును, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ పేరుతో అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ‘ప్రగతి చక్రం’అధికారిక చిహ్నంగా ఉండేది. అయితే దీనిలో కూడా మార్పులు చేస్తూ ‘సన్ రైజ్ స్టేట్’‌ను నవ్యాంధ్ర అధికారిక చిహ్నంగా రూపొందించింది. తాజా చిహ్నాలు జూన్ ఆరు నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సైతం తమ జీవనానికి, మనోభావాలకు అనుగుణంగా చిహ్నాలను ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర కోణంలో చిహ్నాల ఖరారు జరిగిందని, స్వరాష్ట్రంలో మన చరిత్ర నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం అవసరమని అప్పట్లో సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ప్రకృతితో ముడిపడిన అంశాలు, ప్రజల విశ్వాసాలు, పురాణాల నేపథ్యం, శుభాశుభాలు తదితర అంశాలపై లోతైన పరిశీలన జరిపిన తర్వాతే కేసీఆర్ ఈ చిహ్నాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ చిహ్నాలను ఎందుకు ఖారారు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు.