సీరియల్స్‌ వల్లే ఈ నేరప్రవృత్తి : నన్నపనేని

SMTV Desk 2018-05-30 16:21:47  nannapaneni rajakumari, ap state womens chairperson, nannapaneni, vijayawada

అమరావతి, మే 30: టీవీ సీరియల్‌ల ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఉత్తరాంధ్రలో భర్తను భార్య హత్య చేసిన సంఘటన, హత్యాయత్నానికి పాల్పడిన మరొక ఘటన విస్తుగొలిపాయని రాజకుమారి చెప్పారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతే కాకుండా సీరియల్స్‌ మీద సెన్సార్ పెట్టాలని, మహిళల నుంచి పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్‌ చేశారు. మహిళాలలో వస్తున్న ఈ నేరపూరిత ఆలోచనాలు సమాజానికి మంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.