ఐఎఎస్ ను స్పూర్తిగా తీసుకున్న ఎమ్మెల్యే

SMTV Desk 2017-07-10 19:38:11  ias, mla, government school, chathisghad, rampur dist,

రాయ్ పూర్, జూలై 10 : సమాజంలో మార్పు తీసుకురావాలంటే ప్రతి పౌరుడు భాధ్యతతో ముందడుగు వేస్తే అది సాధ్యపడుతుందని అన్నాడు ఓ మహా కవి. ఓ ఐఏఎస్ అధికారి అటువంటి పనిచేసి పదిమందికి ఆదర్శంగా నిలిచారు. ఛత్తీస్ ఘడ్ లోని బల్ రామ్ పూర్ జిల్లాకు చెందిన ఐఎఎస్ అధికారి తన కుమారైను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ విషయాన్ని గమనించిన ఛత్తీస్‌ఘడ్‌ ఎమ్మెల్యే కూడా ఆయన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. పతల్ గావ్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రెటరీ శివశంకర్ తన 5 సంవత్సరాల కుమారుడిని జష్ పూర్ జిల్లాలోని బెన్ గావ్ కు చెందిన ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము నివసిస్తున్న ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు లేవని, తమ కుమారుడిని చదువు కోసం వేరే ప్రాంతానికి పంపించడం తమకు ఇష్టం లేదని ఆయన తెలిపారు. తన కుమారుడు కార్తికేయ కౌరవ్ కు హిందీ భాషపై అవగాహన ఉండటంతో చాలా బాగా అర్థం చేసుకుంటాడని, అందుకే మరో కొత్త భాషతో అతనిపై మరింత భారం మోపాలనుకోవడం లేదన్నారు. ప్రస్తుతానికి అవసరమైన మేరకు ఆంగ్ల భాషను తమ నివాసంలోనే నేర్పుతున్నమని చెప్పారు. తమ మిగితా ఇద్దరు కుమారైలు కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని ఆయన వెల్లడించారు. బల రామ్ పూర్ కలెక్టర్ అవినాష్ శరణ్ ఇటీవలే తమ చిన్నారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడాన్ని స్పూర్తిగా తీసుకున్నానని తెలిపారు. దీంతో అందరూ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే సమాజానికి మార్పు చాలా అవసరం ప్రభుత్వపు విద్యను చదివించడమే అందరి లక్ష్యం అంటూ ఎమ్మెల్యే చెపుతూ వచ్చారు.