చిరు సినిమాలో సోనాక్షి

SMTV Desk 2017-07-10 18:28:20  Bollywood, star, in, small, film

హైదరాబాద్, జూలై 10 : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 వ సినిమా మంచి విజయం సాధించింది. తన తరువాత సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తీయబోతున్నారు. ఈ చిత్రానికి "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదివరకే ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ ను తీసుకున్నట్లు సమాచారం. మరో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు సోనాక్షి ఎంపిక ఖరారైనట్టేనని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాకుండా అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారట. బాలీవుడ్ స్టార్స్ మెయిన్ రోల్స్ లో కనిపించే సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.