వైసీపీకు ఓటు వేస్తే బీజేపీకు వేసినట్లే : నారా లోకేష్

SMTV Desk 2018-05-28 17:29:57  nara lokesh, mahanadu nara lokesh, bjp, ycp, mahanadu

విజయవాడ, మే 28 : ప్రజలు పొరపాటున వైసీపీకు ఓటేస్తే బీజేపీకు వేసినట్లేనని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ ఐసీయూలో ఉందని.. దానికి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందన్నారు. మహానాడు వేదికగా ప్రసంగించిన ఆయన.. భాజపా తాను సొంతగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను రంగంలోకి దించుతోందని ఆరోపించారు. ఉద్దానంలో ప్రభుత్వం నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసిందని.. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి కేటాయించిన వాటర్ ప్లాంటును ఉద్దానానికి ఇచ్చిన విషయాన్ని పవన్‌కల్యాణ్‌ గుర్తించాలన్నారు. పద్దతి ప్రకారం పాలన చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." పద్దతి ప్రకారం పాలన చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి మాపై ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు దమ్ముంటే నాపై చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాలతో సహా నిరూపించాలి. 68 ఏళ్ల వయస్సులో రాష్ట్రం కోసం నిత్యం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య కొందరు కావాలనే చిచ్చు పెడుతున్నారు. తిరుమల వెంకన్నను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఆయన జోలికొస్తే ఎలా మాడి మసైపోతారో అందరికీ తెలిసిందే" అని పేర్కొన్నారు.