"మహానటి"పై అసంతృప్తితో డాక్యుమెంటరీ..

SMTV Desk 2018-05-27 18:27:02  mahanati movie, kamala selvaraj, kaadal kannan documentary.

హైదరాబాద్, మే 27 : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన "మహానటి" చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి జీవితానికి సంబంధించిన విషయాలను అద్బుతంగా తీర్చిదిద్దారంటూ ప్రతిఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కీర్తి.. అచ్చం సావిత్రిలా ఒదిగిపోయింద౦టూ సినీ ప్రముఖులు కితాబిచ్చారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొత్త వివాదం ఒకటి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తన తండ్రిని చిత్రీకరించిన పద్దతిపై జెమినీ గణేశన్ కుమార్తె కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో "మహానటి"లో తన తండ్రి పాత్రను చూపించిన తీరు తనకు ఎంతో బాధపెట్టిందని.. అందుకే, తన తల్లిదండ్రులపై ఓ డాక్యుమెంటరీ నిర్మించానని పేర్కొన్నారు. "కాదల్ మన్నన్" అనే టైటిల్ తో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ నిడివి 100 నిమిషాలు ఉంటుందని, దీనిని త్వరలోనే మీడియా ముందుకు ఆమె తీసుకొస్తానని వెల్లడించారు.