ప్రతి నాయకుడినే కాని.. నిజాయితీ కనిపిస్తోంది..

SMTV Desk 2018-05-27 13:52:34  action king arjun, abhimanyudu movie, chennai anjaneya swamy temple.

హైదరాబాద్, మే 27 : యాక్షన్ కింగ్ అర్జున్.. విశాల్ హీరోగా రూపుదిద్దుకున్న "అభిమన్యుడు" చిత్రంలో నటించారు. ఈ చిత్ర౦ గురించి అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించకపోయి ఉంటే.. నా కెరీర్ లో ఒక పెద్ద తప్పు జరిగిపోయేదని పేర్కొన్నారు. ఈ సినిమాలో నేను చేసింది ప్రతినాయకుడి పాత్రే అయినా.. ఒక నిజాయితీ కనిపిస్తుందన్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నా.. నన్ను ఎక్కువగా ఆదరించింది ప్రేక్షకులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమాలలో విభిన్న పాత్రలను పోషించడం "ద్రోహి" సినిమా నుండి నేర్చుకున్నానన్నారు. ఇదిలా ఉండగా.. హనుమాన్ దేవాలయం గురించి మాట్లాడుతూ.. "చెన్నైలో ఒక హనుమాన్ దేవాలయ౦ కట్టిస్తున్నా. ఇలాంటి ఆంజనేయ స్వామి ప్రపంచంలో ఎక్కడా లేడు. సుమారు 30 అడుగుల ఏకశిలా విగ్రహంలో ఆంజనేయ స్వామి కూర్చుని కనిపిస్తాడు. 180 టన్నుల బరువు ఉంటుంది. ఇక నేను స్వయంగా ఒక చిన్న ఆంజనేయ స్వామిని చెక్కుతున్నా. జనవరి రెండో వారంలో ఆ దేవాలయం ప్రారంభమవుతుంది" అంటూ వెల్లడించారు.