ఉపకార వేతనాలు అందించనున్న తానా

SMTV Desk 2017-07-10 16:04:22  Tana, for, scholarships

హైదరాబాద్, జూలై 10 : అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైర్మన్ శృంగవరపు నిరంజన్ తెలిపారు. 2017- 18 ఏడాదికి డిగ్రీ చదువుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు ఏడు రకాలైన గ్రాడ్యుయేట్ ఉపాకార వేతనాలను అందిస్తోందని, ఒక్కో విద్యార్థికి సెమిస్టర్‌కు 500 డాలర్ల చొప్పున 2 వేల డాలర్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్తర అమెరికాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి, కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు నాలుగు రకాల యువ ఉపకార వేతనాలు ఇస్తోందని తెలిపారు. పూర్తి వివరాలకు chairman@tanafoundation.org ఈ-మెయిల్‌లో సంప్రదించాలని కోరారు.