చై ఛాలెంజ్‌కు సామ్ సై.. వీడియో వైరల్...

SMTV Desk 2018-05-26 11:24:49  samantha, fitness challenge accepted, naga chaitanya,

హైదరాబాద్, మే 26 : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిట్ నెస్ ఛాలె౦జ్ హవా నడుస్తోంది. ఒలింపిక్ ప‌త‌క విజేత రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ "హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌" ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ సెలెబ్రిటీలు సైతం ఛాలెంజ్ కు సై అంటూ వారు వర్కవుట్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య తన భార్య సమ౦త తో పాటు.. అక్కినేని సుమంత్‌, హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌ల‌ను నామినేట్ చేశాడు. ఈ ఛాలెంజ్‌కు సై అన్న సమ౦త.. తను జిమ్ లో వర్కవుట్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా "హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌" ఛాలెంజ్ నాకు చాలా న‌చ్చింది. మ‌న‌సుకు, ముఖ్యంగా క‌ళ్ల‌కు చాలా తేలిక‌గా అనిపిస్తోంది. చైతన్య.. నేను నీ స‌వాలును స్వీక‌రిస్తున్నా" అంటూ వర్కవుట్ చేసిన వీడియో పోస్ట్ చేసింది. అలాగే ఈ ఛాలె౦జ్ ను ఉపాసన, శిల్పారెడ్డి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లకు నేను ఛాలెంజ్‌ విసురుతున్నా" అని సామ్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారి౦ది.