కోహ్లి ఈజ్ మ్యాన్.. నాట్ ఏ మెషిన్..

SMTV Desk 2018-05-25 18:11:26  kohli, ravi shastri, virat kohli and ravi shastri, delhi

ఢిల్లీ, మే 25 : టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత్ కోచ్ రవిశాస్త్రి మద్దతు తెలిపాడు. మెడ గాయం కారణంగా కోహ్లీ కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు కోహ్లీతో ఒప్పందం చేసుకున్న సర్రే క్రికెట్‌ క్లబ్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ..."కోహ్లీ ఏమీ యంత్రం కాదు, అతడు కూడా మనిషే, విశ్రాంతి అవసరం" అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కి నాయకత్వం వహించిన కోహ్లీ ఆఖరి మ్యాచ్‌లో మెడకు గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు సన్నాహకంగా కౌంటీ క్రికెట్‌ ఆడాలనుకున్న కోహ్లీకి నిరాశ ఎదురైంది. తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ.."కోహ్లీ ఏమీ మెషిన్ కాదు. అతడు కూడా మనిషే. అతనేమి టాప్‌ డాగ్‌(ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లను ఇలా పిలుస్తుంటారు) కాదు. కోహ్లీకి వెనుక రాకెట్‌ కట్టి మైదానంలోకి పంపించలేం కదా. అతనికి విశ్రాంతి అవసరమే. టాప్‌ డాగ్‌లకు సైతం రాకెట్‌ కట్టి ఆడించలేం" అని శాస్త్రి కాస్త సహనంగానే మాట్లాడాడు.