ఇకపై నో సర్వీస్ చార్జ్..!

SMTV Desk 2017-07-10 15:29:18  hotels, restarent, service charge, contral government

న్యూఢిల్లీ, జూలై 10 : హోటళ్లకు కేంద్రం కొత్త రకం హెచ్చరిక... హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటినుంచి తమ కస్టమర్ల దగ్గరి నుంచి చార్జీలు వసూలు చేయడం తగదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కస్టమర్లు ఇస్తే తీసుకోవాలి తప్ప వారిని ఒత్తిడి చేసి మాత్రం తీసుకోకుడదన్నారు. అలా గనుక తీసుకుంటే ఆ హోటల్స్ యాజమాన్యం నేరుగా జైలుకే వెళ్ళాల్సి ఉంటుందన్నారు. సర్వీస్ చార్జి అనేది టిప్పులాంటిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలన్నారు. హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు ఏవైనా సర్వీస్ చార్జి కోసం పట్టుబడితే కస్టమర్లు వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాశ్, కె.శ్రీవాస్తవ తెలిపారు. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ లోనే జారీ అయ్యాయని ఈ మేరకు గుర్తుచేశారు. అయితే మార్గదర్శకాలు జారీని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రశ్నించింది. సర్వీస్ చార్జి వసూలు చేయడం చట్టాన్ని అతిక్రమించినట్టేమీ కాదని ఎన్ఆర్ఏఐ సెక్రటరీ జనరల్ ప్రకుల్ కుమార్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు అంటే చట్టాలు కాబోవని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు జారీ చేస్తున్న ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. దీంతో హోటల్స్, రెస్టారెంట్ ల యాజమాన్యాలు ఈ చార్జీలను చూసి తీసుకోవాల్సిందిగా తెలుస్తుంది.