నెటిజన్ కి అభిషేక్ దిమ్మతిరిగే కౌంటర్...

SMTV Desk 2018-05-25 17:14:20  abhishek bacchan, social mediya, babi diyol counter.

ముంబై, మే 25 : బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కు ఓ నెటిజన్ ఘాటు కామెంట్ పెట్టాడు. దీంతో ఆ నెటిజన్ కు అభిషేక్ మంచి కౌంటర్ ఇచ్చారు. విషయమేమిటంటే.. బాబీ డియోల్‌ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా "క్రికెటర్‌ స్టూవర్ట్‌ బిన్ని.. బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్ ఒకే రకం. అర్హులు కాకపోయినప్పటికి వీరిద్దరికీ అందమైన భార్యలు దొరికారు. తండ్రుల పాపులారిటీని వాడుకుని ఒకరు సినిమాల్లో, మరొకరు క్రికెట్‌లోకి వచ్చారు. ఇద్దరూ పనికిరానివాళ్లే. ఇది నిజమని అనిపిస్తే మీరూ రీట్వీట్ చేయండి" అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ చూసిన అభిషేక్ బచ్చన్.. "నా స్థానంలో ఉండి ఒక మైలు ప్రయాణించి చూడు. నీ ట్వీట్‌ను బట్టి చూస్తే నువ్వు నాలా ప్రయాణించలేవని అర్థమవుతోంది. నువ్వు పది అడుగులు నడవగలిగినా నేను సంతోషిస్తాను. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని ఇతరుల గురించి బాధపడకు. ఎవరి ప్రయాణం వారిది అన్న విషయం దేవుడికి తెలుసు" అని పేర్కొన్నారు. ఇది చూసిన సదరు నెటిజన్.. "అభి.. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు బాధపడి ఉంటే క్షమించు" అని వేడుకున్నాడు.