జి-7 కు యుద్ద విమానాలు, నౌకలతో పటిష్టమైన భద్రత

SMTV Desk 2017-05-27 15:00:43  G-7,america,itali,iropa union,iropa comission,canadam,france

ఇటలీ, మే 25 : ప్రపంచ అగ్రదేశాల సభ్యత్వం ఉన్న జి-7 సదస్సు అత్యంత పగడ్బంది భద్రత మధ్య ప్రారంభం అయింది. బ్రిటన్ లో జరిగిన ఆత్మహుతి దాడి నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇటలీలోని తావోర్మినాలోని ఓ ప్రాచీన థియోటర్ లో జి-7 సదస్సు ప్రారంభం అయ్యింది. సమీప సముద్ర జలాల్లో యుద్దనౌకలు పహారా కాస్తుండగా, 9 యుద్ద విమానాలు ఆ ప్రదేశంలో నిరంతరంగా చక్కర్లు కొడుతున్నాయి. చీమ కూడా దూరని తరహాలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతున్నది. వాణిజ్యం, వాతావరణ మార్పులపై జి-7 సదస్సు చర్చించనుంది. జి-7 దేశాల సదస్సుకు హాజరైన వారిలో ఐరోపా మండలి అధ్యక్షులు డోనాల్డ్టస్క్, బ్రిటన్ ప్రధాని థేరిసా మే, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఏంజేల్ మెర్కెల్, జపాన్ ప్రధాని షింజోఅబే, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు జిన్ క్లాడ్ జంకర్, ఇటలి ప్రధాని జెంటిలోని తదితరులు ఉన్నారు. గత సంవత్సరం కాప్ సదస్సు తీర్మానాల అమలు, ప్రపంచ వాణిజ్యం తదితర అంశాలపై జి-7 సదస్సు విస్తృతంగా చర్చించనుంది. దానికి తోడు అమెరికా దుందుడుకుకు కళ్ళెం వేసేందుకు జి-7 దేశాలు ట్రంప్ పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడవుతోంది.