జేబీ "గ్యాంగ్ స్టర్" రచ్చ..

SMTV Desk 2018-05-22 17:29:46  jb as gangstars kd, websireas, jagapathi babu, trailer.

హైదరాబాద్, మే 22 : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా విలన్ పాత్రలను పోషిస్తూ.. ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జగపతిబాబు. ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నా.. బుల్లితెరపై ఓ లుక్కేశారు. "జేబీ యాజ్ గ్యాంగ్ స్టార్స్ కేడీ" అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. జగపతి బాబు, నవదీప్, శివాజీ అలాగే శ్వేతా బసు ప్రసాద్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో ప్రతి పాత్ర యొక్క పని తీరును పరిచయం చేశారు. మొత్తం 13 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ కు నందినీ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే అందించగా అజయ్ భుయాన్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారం కానుంది. మొత్తంగా ఈ ట్రైలర్ లో సినిమా షూటింగ్ వివాదాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. జూన్ 1న ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయనున్నారు.