క్యాబ్ షేరింగ్ సేవలు ఆగిపోనున్నాయి

SMTV Desk 2017-07-09 18:29:01  Cab, sharing, services, will, stop

న్యూఢిల్లీ, జూలై 9 : త్వరగా గమ్యం చేరడానికి చాల మంది క్యాబ్స్ ని ఆశ్రయిస్తుంటారు. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సాగించాలనుకున్న వారికి ఇప్పుడు ఇది చేదువార్తే! అవును త్వరలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. సిటీ టాక్సీ స్కీం-2017 ముసాయిదాకు, ఢిల్లీప్రభుత్వం ఆమోదముద్ర వేసిన పక్షంలో క్యాబ్ షేరింగ్ సేవలు ఆగిపోనున్నాయి. క్యాబ్ షేరింగ్ సేవలకు న్యాయపరమైన అనుమతి లేదు. దీనిపై అధికారులు మాట్లాడుతూ క్యాబ్ షేరింగ్ మంచి విధానమే, దీనివలన రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గేందుకు అవకాశాం కూడా ఉంటుందన్నారు. కాని ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన విధానాల కారణంగా క్యాబ్ షేరింగ్ సమ్మతం కాదు. కేవలం టాక్సీలను అద్దెకు తీసుకుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది కాని మధ్యలో ఇంకొక పాసింజర్‌ను ఎక్కించుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.