నన్ను అడక్కుండానే ఎలా వేస్తారు..!!

SMTV Desk 2018-05-21 18:34:01  ANCHOR RASHMI, NEW EVENT, ANCHOR RASHMI TWITTER.

హైదరాబాద్, మే 21 : యాంకర్ రష్మి.. తన అనుమతి లేకుండా.. ఆమె ఫొటోను ఓ సంస్థ ప్రచురించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఓ ఈవెంట్‌కు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల‌తో క‌లిసి ర‌ష్మి హాజ‌ర‌వుతోందంటూ నిర్వాహ‌కులు ప్ర‌చారం చేసుకున్నారు. తాము నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మి కూడా హాజరు కాబోతున్నారని ఓ సంస్థ ప్రచురించింది. అంతేకాదు ఆమె ఫొటోను కూడా ప్రకటనలో ఉంచింది. ఈ ప్రకటన చూసిన రష్మి.. ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. "నన్ను అడగకుండా నేను అతిథిగా వస్తున్నారంటూ ఇలా ప్రకటన వేయడమేంటి.? ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఫొటోలు పెట్టేముందు ఈ సంస్థలు సదరు ప్రముఖుల అధికారిక అనుమతి పత్రాలను ఎందుకు పరిశీలించవు" అని కాస్త ఘటుగానే స్పందించింది. మరి ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థ ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం రష్మి బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ.. పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.