వైరల్ : చెర్రీ సమేతంగా తారక్..

SMTV Desk 2018-05-20 18:16:22  ntr birthday special, ramcharan photo share on facebook.

హైదరాబాద్, మే 20 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు తారక్.. నీకు అన్నీ విజయాలే దక్కాలని, చేసిన ప్రతీ పని అనుకూలించాలని కోరుకుంటున్నా" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా రామ్‌చరణ్‌ తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ అపురూపమైన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. చరణ్‌ తారక్‌ను వెనుక నుంచి హత్తుకుని ఆటపట్టిస్తూ కనిపించారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా!! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి" అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ఈ ఫొటోకు అభిమానుల నుంచి విపరీతమైన కామెంట్లు, లైకులు వస్తున్నాయి. తారక్‌, చరణ్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కనుంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.