అందుకే నాకు ప్రప్రోజల్స్ రాలేదు : నిహారిక

SMTV Desk 2018-05-20 17:56:50  niharika, love proposal, nagababu, megastar chiru.

హైదరాబాద్, మే 20 : మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు చాలామంది హీరోలు వెండితెరపై మెరిశారు. కాని ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ నిహారిక. మెగా ప్రిన్సెస్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నిహారిక.. బుల్లితెరపై యాంకర్ గా రాణించింది. అంతేకాకుండా "ఒక మనసు" చిత్రంతో వెండి తెర పైకి వచ్చింది. అయితే నిహారికపై అందరి హీరోయిన్స్ లానే నిహారికపై రూమర్లు పుట్టుకొచ్చాయి. మొన్నామధ్య రెబల్ స్టార్ ప్రభాస్ తో నిహారిక పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అలంటి వదంతులను నమ్మకండి అదంతా అబద్దం అంటూ మెగా ఫ్యామిలీ ఖండించాల్సి వచ్చింది. అయితే నిహారిక.. తన లవ్ ప్రపోజల్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తన కాలేజ్ డేస్ నుంచి సినీ కెరీర్ వరకు జరిగిన విషయాలను మనసు విప్పి మాట్లాడింది. అందరమ్మాయిల్లాగే తనకూ ఎవరన్నా లవ్ ప్రపోజ్ చేస్తే బావుండనిపిస్తుందని.. చెప్పింది. కాలేజ్ టైమ్ లో అయినా ఎవడైనా ప్రపోజ్ చేయకపోతాడా అని ఎదరుచూశాన౦ది. తాను బాగుండనేమోనని...అందుకే ఎవరూ ప్రపోజ్ చేయడం లేదేమో అనుకున్న రోజులు కూడా ఉన్నాయట. తన తండ్రి నాగబాబు చాలా బ్రాడ్ మైండెడ్ అని తనకు తగినంత ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పింది. తన వెనుక నాన్న, అన్నయ్య, డాడీ(చిరంజీవి) ఉండడం వల్ల ఎవరూ ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేద౦టూ చెప్పుకొచ్చింది.