పని లేకపోతే అల్లరి పిల్లగా మారిపోతా..

SMTV Desk 2018-05-20 16:54:34  anupama parameshwaran, latest interview.

హైదరాబాద్, మే 20 : మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అభిమానులలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వరుస అవకాశాలను దక్కించుకొని సినిమా షూటింగ్ లలో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ భామ ఖాళీగా ఉంటే ఎక్కువగా అలసిపోతో౦దట. ఎవరైనా ఎప్పుడు అలసిపోతారు.. ఏదైనా పని చేసినప్పుడు అలసిపోతారు. కాని అనుపమ నేను ఖాళీగా ఉంటేనే అలసిపోతా అంటోంది. "నిత్యం ఏదో ఒక పని చేయడం అలవాటు. కనీసం అల్లరైనా చేయాల్సిందే! చిన్నప్పట్నుంచీ నా వరస అంతే. అదే అలవాటు కథానాయికని అయ్యాక మారలేదు. ఒకసారి సెట్లోకి అడుగుపెట్టానంటే ఎవరితోనో ఒకరితో, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా. కుదురుగా ఒకచోట కూర్చోమంటే మాత్రం నావల్ల కాదు. నా మనస్తత్వం తెలిసినవాళ్లు నేను సెట్లో కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకేమైందోనని కంగారు పడిపోతుంటారు" అని చెప్పుకొచ్చింది