హీరోయిన్ తో చరణ్ వర్కవుట్స్.. వీడియో వైరల్..

SMTV Desk 2018-05-20 12:06:41  RAM CHARAN, KAIRA ADWANI, BOYAPATI SRINU, BYANKAK.

హైదరాబాద్, మే 20 : రామ్ చరణ్ భార్య ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటారు. తన భర్తకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం బ్యాంకాక్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ హీరోయిన్ కైరా అద్వానీ తో కలిసి జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే కాసేపు విశ్రాంతి దొరకడంతో అక్కడి ఓ చెరువులో చెర్రీ చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి.