‘ఎన్టీఆర్’లో బాలీవుడ్ నటి..!!

SMTV Desk 2018-05-19 18:11:22  ntr biopic, director krish, balakrishna, vidhya balan.

హైదరాబాద్, మే 19 : ఎన్టీఆర్ బయోపిక్ పై రోజుకో వార్త వెలువడుతోంది. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఎట్టకేలకు ఓ విషయంలో స్పష్టత వచ్చింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నటీనటులు ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం గతంలో విద్యాబాలన్ ని సంప్రదించినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఇప్పడు ఈ పాత్ర చేయడానికి విద్యా బాలన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. జులై లో విద్యా బాలన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇదివరకే "గౌతమి పుత్ర శాతకర్ణి" వచ్చిన సంగతి తెలిసిందే.