ప్రమోషన్ లో కొత్త పుంతలు తొక్కుతున్న "నా నువ్వే"..

SMTV Desk 2018-05-19 15:51:32  NA NUVVE NEW PROMOTIONS, KALYAN RAM, TAMANNA.

హైదరాబాద్, మే 19 : ఈ మధ్య కాలంలో తమ సినిమాలను దర్శకనిర్మాతలు చాలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ "మెహబూబా" సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ట్రక్ పై మెహబూబా పోస్టర్ తో ప్రచారం నిర్వహిస్తూ మజ్జిగ పాకెట్స్ అందించారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఐస్ క్రీం ట్రక్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు చల్లని ఐస్ క్రీం అందించారు. తాజాగా "నా నువ్వే" చిత్ర యూనిట్ కూడా.. మజ్జిగ ప్యాకెట్స్ అందిస్తున్న విషయ౦ తెలిసిందే. అంతేకాకుండా "ఓలా కారెక్కండి.. కళ్యాణ్‌ రామ్, తమన్నాలను కలుసుకోండి" అంటూ ఓ సరికొత్త ఆలోచనతో వచ్చారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. ఓలా కారులో ఈ నెల 18 నుండి 22 తేదీ మధ్య కాలంలో మూడు ప్రైమ్ రైడ్స్ చేయండి. నేరుగా కళ్యాణ్‌ రామ్, తమన్నాలను కలుసుకోండి అంటూ సూపర్ ఆఫర్ ప్రకటించేసింది. అయితే ఈ వినూత్న ప్రయోగం ద్వారా సినిమా ప్రమోషన్‌తో పాటు ఓలా వారికి మంచి బిజినెస్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే మరి. అటు ప్రమోషన్.. ఇటు బిజినెస్.. ఐడియా అదిరింది కదూ. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.