"నా నువ్వే" వినూత్న ప్రచారం..

SMTV Desk 2018-05-19 14:13:20  na nuvve movie, na nuvve butter milk truck, movie promotions

హైదరాబాద్, మే 19 : కళ్యాణ్ రామ్, తమన్నా తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం "నా నువ్వే". ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక వినూత్న రీతిలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. "నానువ్వే" పోస్టర్స్‌తో కూడిన ట్రక్స్ ఏర్పాటు చేసింది. ఈ ట్రక్స్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సిటీల్లో తిరుగుతూ చల్లని మజ్జిగను ఉచితంగా అందిస్తాయని ప్రకటించింది. అంతేకాదు.. మజ్జిగ తాగి ఆ ట్రక్‌తో ఓ సెల్ఫీ దిగి చిత్రయూనిట్‌కి పంపిస్తే.. వారిలో లక్కీ విన్నర్స్‌ని సెలెక్ట్ చేసి ఐదుగురికి వన్ ప్లస్ 5 మొబైల్ అందించనున్నారు. అలాగే మరో 20 మందికి సినిమా టికెట్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటన కూడా జారీ చేశారు యూనిట్ సభ్యులు. రొమాంటిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.