వైరల్ అవుతున్న శ్రద్దా కపూర్ వీడియో..

SMTV Desk 2018-05-19 13:10:48  sradda kapoor, new viral video, sahoo movie, mumbai.

హైదరాబాద్, మే 19 : బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ సరసన "సాహో" చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అది చూస్తే శ్రద్దా ను అభినందించకుండా ఉండలేరు. ఎందుకో తెలుసా..!! ఆమె సంస్కారం అలాంటిది మరి. ఇంతకి ఆమె చేసిన పనేంటి అనేగా మీ సందేహం. ఇటీవల "స్త్రీ" సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, శ్రద్దా ముంబై తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను కొందరు అభిమానులు కలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక వృద్ధ మహిళ కూడా ఆమెకు ఎదురుపడింది. ఆమె శ్రద్ధాను చూసి చేతులు జోడించింది. దీంతో శద్ధా కూడా ఆమెకు వినయంతో నమస్కరించింది. ఈ వీడియో కాస్త ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు సంస్కారం అంటే ఇలా ఉండాలి.. అంటూ శ్రద్దా కపూర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ఆమెను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం సాహో షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.