అదుర్స్ అనిపిస్తున్న "నా నువ్వే" సాంగ్ టీజర్..

SMTV Desk 2018-05-18 19:04:03  NA NUVVE MOVIE, NIJAMA MANASA SONG TEASER, TAMANNAA, KALYAN RAM

హైదరాబాద్, మే 18 : హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "నా నువ్వే". తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటిసారి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో తమన్నా కళ్యాణ్ రామ్ ని అమితంగా ప్రేమించే అమ్మాయిలా కనిపిస్తుంది. తను పలికే సంభాషణలు. భావోద్వేగంతో కళ్యాణ్ రామ్ ను ఉద్దేశించి నా ప్రేమ, బాధ అందరికి వినపడుతుంది. నీకు వినిపించడం లేదా అంటూ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి "నిజమా మనసా.." అంటూ సాగే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో కళ్యాణ్ రామ్, తమన్నాల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి వేసిన డాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.