సెన్సార్ పూర్తి చేసుకున్న "నేల టిక్కెట్"..

SMTV Desk 2018-05-18 18:19:33  nela ticket, nela ticket sensor completed, raviteja, kalyan krishna, malavika sharma,

హైదరాబాద్, మే 18 : మాస్ మహారాజ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నేల టిక్కెట్". మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు అభిమానుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా అటు మాస్ ఆడియన్స్ తో పాటు యూత్.. ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమ, యాక్షన్ కాంబినేషన్ లో రూపొంది౦చిన ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ బాణీలు అందిస్తున్నారు. కాగా ఈ నెల 24 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.