"కేడీ" గా రానున్న జగపతి బాబు..

SMTV Desk 2018-05-18 14:41:01  jb as gangstars kd, websireas, jagapathi babu, first look.

హైదరాబాద్, మే 18 : ఈ మధ్య కాలంలో టాలీవుడ్ రియాలిటీ షోలలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. అందుకే అనేక రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. కేవలం యూట్యూబ్ లోనే కాకుండా అనేక రకాల ఫ్లాట్ ఫార్మ్ లు టాలెంట్ చూపించుకోవడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఆ తరహా దారిలో వారి టాలెంట్ ను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు కొంత మంది నటీనటులు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా విలన్ పాత్రలను పోషిస్తూ.. ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జగపతిబాబు. సినిమాలలో బిజీగా ఉన్నా.. ఇటు బుల్లితెరపై కూడా ఓ లుక్కేశారు. "జేబీ యాజ్ గ్యాంగ్ స్టార్స్ కేడీ" అనే వెబ్ సిరీస్‌లో జేబీ నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు నందినీ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే అందించగా అజయ్ భుయాన్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు సరసన శ్వేతాబసు ప్రసాద్ నటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారం కానుంది. ఈ లుక్‌లో జగపతి ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఒక డిఫరెంట్ లుక్‌లో ఉన్న ఆయన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.