నాకు పెళ్లి వయసు వచ్చింది.. నీకై ఎదురుచూడనా..!!

SMTV Desk 2018-05-18 13:07:53  nayanatara, director vignesh shivan, Nayanatara love proposal.

చెన్నై, మే 18 : ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నయనతార.. తమిళ దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ వారు తిరిగిన ప్రదేశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. తాజాగా విగ్నేశ్‌ శివన్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. నయన్‌, విగ్నేశ్‌లు నల్ల టోపీలు పెట్టుకుని దిగిన ఫొటోను విగ్నేశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. "హే.. నాకు పెళ్లి వయసు వచ్చింది. నీకోసం ఎదురుచూడనా?" అంటూ తమిళంలో క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ మాటలు నయనతార తమిళంలో నటిస్తున్న "కొలమావు కోకిల" అనే సినిమాలోనివి. ఈ చిత్రంలో "కల్యాణ వయసు.." అనే పాటలోని లిరిక్స్‌ను విగ్నేశ్‌ పోస్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ మధ్య కాలంలో నయనతార ఓ అవార్డుల కార్యక్రమంలో నా కాబోయే భర్త అంటూ చెప్పకనే చెప్పింది. కాగా ప్రస్తుతం నయన్ తెలుగులో‌.. మెగాస్టార్ సరసన "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటిస్తున్నారు.