కన్నడ రాజకీయం : యడ్యూరప్పకు రేపే బలపరీక్ష

SMTV Desk 2018-05-18 12:31:25  #KarnatakaVerdict, floor test in Karnataka, supreme court, congress-jds

ఢిల్లీ, మే 18 : కర్ణాటకలో జరుగుతున్నా రాజకీయ సమరంకు రేపటితో ముగింపు పడనుంది. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విధాన సౌధలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. మరి ఈ బల పరీక్షను బీజేపే నాయకత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరో వైపు కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీలు మారాకుండా రిసార్ట్ రాజకీయాలు చేస్తుంది. "గవర్నర్‌ ఎవర్ని పిలిచారు అన్న విషయం విస్మరిస్తే బలపరీక్షే దీనికి పరిష్కారం. విధాన సభలో బలాబలాలు తేలాలి. బలపరీక్ష రేపే నిర్వహించాలి" అని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా ఏజీ అటార్నీ జనరల్ రోహత్గి స్పందిస్తూ.. బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు కోర్టు అంగీకరించలేదు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పిటిషన్‌పై ఈ ఉదయం 10.30గంటలకు విచారణ ప్రారంభించిన అత్యున్నత ధర్మాసనం.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్‌ను కోరిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో బీజేపే తరఫున వాదిస్తున్న ముకుల్‌ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రోహత్గి తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమని వెల్లడించారు.