చర్మసంరక్షణకు చిట్కాలు..

SMTV Desk 2018-05-17 15:01:29  skin care tips, beauty tips, skin care, hyderabad

హైదరాబాద్, మే 17 : ఎన్నో పనులు... ఎంతో ఒత్తిడి.. ప్రస్తుత కాలంలో అందరూ సంపాదించాలన్న కోరికతో కొన్ని విషయాలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మహిళలకు చర్మసంరక్షణకు ఖాళీ దొరకదు. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. >> తరచూ ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే రోజూ స్నానం చేయడానికి ముందు పెసరపిండీ, పెరుగూ, తేనె కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. చర్మం నునువుగా మారుతుంది. >> ఎండా, దుమ్మూ, ధూళి వంటివి జుట్టుని నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఇలా అనిపించినప్పుడు కోడిగుడ్డు తెల్లసొనకు రెండు చెంచాల పుల్లటి పెరుగూ, పది మందారాకులను కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా నిగనిగలాడుతుంది. >> జుట్టూ, చర్మం మాత్రమే అందంగా ఉంటే సరిపోతుందా! చేతులూ కాళ్లూ కూడా మెరిసిపోవాలిగా. దానికోసమూ ఇంట్లో ప్రయత్నించొచ్చు. ముందుగా అరబకెట్‌ గోరువెచ్చని నీళ్లల్లో రెండు చెంచాల షాంపూ వేసి పాదాలను పదిహేను నిమిషాలు అందులో ఉంచాలి. >> ఆ తరవాత ప్యూమిక్‌ రాయితో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చక్కెరా, సెనగపిండీ పాలూ, తేనె కలిపిన మిశ్రమాన్ని పాదాలకు పట్టించి, అది పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. పెడిక్యూర్‌ చేయించుకున్నట్లే పాదాలు కోమలంగా కనిపిస్తాయి. ఇదే పూతను చేతులకూ రాసుకోవచ్చు.