ఉతికేందుకు పద్ధతుంది..!

SMTV Desk 2018-05-17 13:25:13  dress washing, dress washing tips, hyderabad, cold water

హైదరాబాద్, మే 15 : ఒక్కో రకం దుస్తులకి ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రంగు వేలిసిపోవడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. >> నీలిరంగు ముదురు డెనిమ్ ప్యాంట్లను చల్లని నీటితో ఉతకాలి. అదే తెలుపు, ఇతర రంగులైతే గోరు వెచ్చని నీరు వాడాలి. వీటిని నీడ పట్టున ఆరేస్తే మంచిది. >> ముదురు నీలిరంగు నూలు దుస్తులకు చల్లటి నీరు వాడాలి. లేత, తెలుపు, రంగు అయితే వేడినీటితో ఉతకడం మంచిది. >> చాలా మంది దుస్తులను ఒకసారి మడతపెట్టి మరోసారి వాడుతారు. మిగిలినవి ఎలా ఉన్న.. లెనిన్ తరహా మాత్రం ఎప్పటికప్పుడు ఉతికేయాలి. లేదంటే చెమట కారణంగా వాటిలో ఫంగస్ చేరుతుంది. >>క్రీడాకారులు వేసుకునే దుస్తులూ, వ్యాయామానికి వాడే రకాల్ని చల్లటినీటిలో ఉతకాల్సి ఉంటుంది. ఒక వేళా వాటిపై రేయాన్ అని రాసి ఉంటే.. బ్లీచింగ్ వాడకూడదు. మెలితిప్పి పిండకూడదు. >> పట్టు, సిల్క్ రకాలను చల్లని నీటిలో ఉతకాలి. కానీ పిండకూడదు.