ఆకట్టుకుంటున్న "నేల టిక్కెట్" ట్రైలర్..!!

SMTV Desk 2018-05-17 11:35:47  nela ticket trailer, raviteja, malavika sharma, kalyan krishna.

హైదరాబాద్, మే 17 : మాస్ మహారాజ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నేల టిక్కెట్". మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.? కాని సాయం చేయడానికి ఒక్కరు లేరు. ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం" అని రవితేజ చెబుతున్న డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ను చూస్తే రవితేజ వృద్దులకు సాయం చేసే వ్యక్తిగా నటిస్తున్నట్లు అర్థం అవుతోంది. అలాగే ప్రతి నాయకుడిగా జగపతిబాబు తన హావభావాలతో అదరగొట్టారు. అలాగే హీరోయిన్ మాళవిక ఈ చిత్రంలో డాక్టర్ గా నటిస్తున్నారు. ఆమెను చూడగానే రవితేజ ప్రేమలో పడతాడు. చివరగా "నేల టిక్కెట్టు వారితో పెట్టుకుంటే నేల నాకించేస్తారు" అంటూ రవితేజ ఆవేశంతో చెబుతున్న డైలాగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. రవితేజ మాస్ డైలాగ్స్ తో, ప్రేమ, యాక్షన్ కాంబినేషన్ లో ఈ ట్రైలర్ ను రూపొందించారు. రామ్‌ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ నెల 24 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.