మెగాస్టార్ కి సైతం తప్పని కొరత!!

SMTV Desk 2017-07-08 18:16:01  Shortage, of, heroines, in, Tollywood

హైదరాబాద్, జూలై 08 : టాలీవుడ్ లో చాలా వరకు కొత్త సినిమాలు రానున్నాయి. సినిమాకి సర్వం సిద్ధంగా ఉన్నప్పటికీ హీరోయిన్ మాత్రం దొరకట్లేదట. స్టార్ హీరోయిన్ లు లేకపోవడంతో కొత్తగా వచ్చిన హీరోయిన్ లు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. మెగా స్టార్ వంటి స్టార్ హీరో సినిమాకి కూడా ఈ కొరత తప్పలేదు. అయితే చిరంజీవి 151వ చిత్రంలో ఐశ్వర్య రాయి, అనుష్క, నయన తార నటిస్తున్నారంటూ పలు గాసిప్స్ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ నుండి మాత్రం ఇప్పటి వరకు ఏ ప్రకటన రాలేదు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నప్పటికి ఇంకా హీరోయిన్ విషయంలో స్పష్టత రాలేదు. హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, అక్కినేని అఖిల్ ఇందుకు మినహాయింపు ఏం కాదు. ఈ జాబితా లో వారు కూడా ఉన్నారు. ఇంకా ఈ కొరత ఎప్పటికి తీరేనో!!