కావేరిపై కర్ణాటక ఎఫెక్ట్..

SMTV Desk 2018-05-16 16:41:28  cauvery dispute, cauvery karnataka, tamilanadu, supreme court

చెన్నై, మే 16 : కర్ణాటకలో జరుగుతున్నా రాజకీయ అనిశ్చితి ప్రస్తుతం కావేరి నదిజలాల కేసుపై ఎఫెక్ట్ చూపింది. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు నిర్వహించాలన్న నేపథ్యంలో ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టులో ముసాయిదాను సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల తీర్పుపై స్పష్టత లేకపోవడంతో కేసును వాయిదా వేయాల్సిందిగా కర్ణాటక సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కానీ ఇందుకు తమిళనాడు ఒప్పుకోలేదు. చాలా కాలంగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ తమిళనాడు కంటే కర్ణాటకకే ఎక్కువ టీఎంసీలు అందాలని ఆదేశించింది. దాంతో ఒక్కసారిగా తమిళనాడులో ఆందోళనలు చెలరేగాయి. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలని తమిళనాడు డిమాండ్‌ చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇప్పుడు ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు ఎక్కువగా తమిళనాడుకు కావేరీ నీరు కేటాయించాలని.. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణాటకను ఆదేశించింది. కానీ ఇందుకు కర్ణాటక అంగీకరించలేదు. ఇప్పుడు ముసాయిదాను సమర్పించడంతో తమిళనాడులో మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయమై సుప్రీం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరోపక్క కన్నడ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. నిన్న వెలువడిన కర్ణాటక ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కమలం పార్టీ 8 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండి పోయింది. అతి పెద్ద పార్టీనే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని అటు బీజేపీ అంటుండగా, మరోవైపు తమకు కావాల్సిన మద్దతు ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అంటోంది. దీనిపై గవర్నర్‌ నిర్ణయం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.