నా ప్రేమ నీకు వినిపించడం లేదా..!!

SMTV Desk 2018-05-16 13:37:43  na nuvve trailer, kalyana ram, tamanna, jayendra director.

హైదరాబాద్, మే 16 : హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "నా నువ్వే". తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటిసారి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేమ, యాక్షన్‌, కామెడీ లను ప్రధానంగా చూపించారు. తమన్నా ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ని అమితంగా ప్రేమించే అమ్మాయిలా కనిపిస్తుంది. తను పలికే సంభాషణలు. భావోద్వేగంతో కళ్యాణ్ రామ్ ను ఉద్దేశించి "నా ప్రేమ, బాధ అందరికి వినపడుతుంది. నీకు వినిపించడం లేదా".! అంటూ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ వేరే ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో తమన్నా.. వెళ్ళండి కలుద్దాం.. అంటుంది. అప్పుడు వెన్నెల కిషోర్ "ఇదేం ట్విస్ట్‌ బావా.. జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది" అంటూ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ మే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.