నేటి నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో పూజ హెగ్డే..!!

SMTV Desk 2018-05-14 12:17:06  pooja hegde, ntr movie, trivikram, shooting started.

హైదరాబాద్, మే 14 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ లో పూజ ఈ రోజు నుంచి జాయిన్ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్.. పూజా హెగ్డే కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో డాన్స్‌ల కోసమే పూజ ఎన్టీఆర్‌ దగ్గర కొన్ని స్టెప్పులకు గాను శిక్షణ తీసుకుందట! ఆయనతో సమంగా డాన్స్ చేయాలంటే ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటేనే చేయగలను అనుకుందో ఏమో మరి.