నా త‌మ్ముడు ఎన్టీఆర్ ఓ ఆటం బాంబ్: క‌ల్యాణ్ రామ్

SMTV Desk 2017-05-29 14:27:45  kalyan ram,jr ntr,good brother,ntr atombomb,

హైదరాబాద్, మే 29 : త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ ఓ ఆటం బాంబు అని నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ అన్నాడు. అమెరికాలో జ‌రిగిన‌ తానా ఉత్సవాల్లో ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న అవార్డ్స్ వేడుక‌కు హాజ‌రైన కల్యా‌ణ్ రామ్ కు నంద‌మూరి అభిమానులు ఘ‌నంగా స్వాగతం పలికారు. ఆ స‌మ‌యంలో వారు జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మ‌ని కల్యాణ్ రామ్‌ను కోరారు. దానికి స‌మాధానంగానే క‌ల్యాణ్ రామ్.. ఆటం బాంబ్ అని చెప్పాడ‌ట‌. దీంతో జై ఎన్టీఆర్‌.. జై ఆటం బాంబ్ అని అక్కడి వారు నినాదాలు చేశారు. అయితే, అదే స‌మ‌యంలో జూ.ఎన్టీఆర్ ను ఒక అభిమాని లెజెండ్ అన్నాడు. దీంతో త‌న త‌మ్ముడిని అలా పిల‌వ‌కూడ‌ద‌ని లెజెండ్ అనే పదం పెద్దవాళ్లను ఉద్దేశించి వాడతారని, ఎన్టీఆర్ ఇంకా చిన్నవాడేనని కల్యాణ్ రామ్ అన్నాడు.