"ఆఫీసర్" ట్రైలర్ రిలీజ్...

SMTV Desk 2018-05-12 12:59:59  officer trailer, ram gopal varma, nagarjuna, trailer release.

హైదరాబాద్, మే 12 : మనసుకు.. మైండ్‌కు తేడా ఏంటో ఆఫీసర్ సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన "ఆఫీసర్" సినిమా ట్రైలర్ ని కాసేపటి క్రితం విడుదల చేశారు. "ప్రతీ మనిషిలో ఒక దేవుడు రాక్షసుడు ఇద్దరూ ఉంటారు" అంటూ నాగార్జున చెప్పే డైలాగు లతో ట్రైలర్ మొదలవుతుంది. ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతున్న ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి కథ నడుస్తుంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈనెల 25న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.