తమిళ అనువాదంలోకి "భరత్ అనే నేను"..

SMTV Desk 2018-05-12 11:49:26  BHARATH ANE NENU, TAMIL DUBBING, MAHESH BABU, KORATALA SHIVA.

హైదరాబాద్, మే 12 : ప్రిన్స్ మహేష్ బాబు "భరత్ అనే నేను" చిత్రంలో యువ ముఖ్యమంత్రిగా నటించి అందరి మన్ననలు పొందారు. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన సత్తా చాటింది. అంతేకాదు చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులను మొదలు పెట్టారు. తమిళ వెర్షన్ ను అక్కడ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. మరి తమిళంలో ఎలాంటి రికార్డులను కొల్లగొడుతు౦దో చూడాలి.