జీ-20 వేదికపై ప్రధాని మోది

SMTV Desk 2017-07-08 12:26:38  indian, presindent, narendra modi, ji,20,

జర్మనీ, జూలై 08 : శుక్రవారం ప్రారంభమైన జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోది ఉగ్రవాదం అంతం చేయాలని సూచించారు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్‌... ఇలా ఎన్నో ఉగ్ర సంస్థలు ఉన్నాయని వాటిని నిర్వీర్యం చేయాలని, వాటికి కావల్సిన ఆయుధ సామాగ్రిని వాళ్లకి చేరకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ సదస్సులో ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పులు, స్వేచ్చ వాణిజ్యం, వలసల సమస్యల గురించి కూడా చర్చిస్తున్నారు. ఈ సదస్సులో మోది 11 అంశాలు ప్రకటించారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో 20 అంశాలను సదస్సు ప్రకటించింది. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ మాట్లాడుతూ వివాదాస్పదమైన అంశాల్లో సభ్య దేశాలు తమ సిద్ధాంతాలపై రాజీపడకుండానే ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కారించుకోవాలన్నారు. ఉగ్రవాదంపై ప్రస్తుతం అంతర్జాతీయ పోరు బలహీనంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల సమక్షంలో మోడీ అన్నారు. పాకిస్థాన్‌ గురించి కూడ అయన ప్రస్తావించారు.