"ఆఫీసర్" రిలీజ్ డేట్ ఫిక్స్..!!

SMTV Desk 2018-05-11 18:24:42  ram gopal varma, officer movie, rilease date fix.

హైదరాబాద్, మే 11 : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా "ఆఫీసర్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్స్ ను రిలీజ్ చేశారు వర్మ. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్టు నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మే 12 వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నామని.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున ఒక పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. నాగ్ సరసన మైరా సరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు వర్మ దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు.