జీఎస్టీ ఎఫెక్ట్.. సినిమా టికెట్ల పై?

SMTV Desk 2017-07-08 11:35:27  gst, Movies, entertainment, tax, Exception

చెన్నై, జులై 7 : జీఎస్టీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల యజమానులు నాలుగు రోజుల పాటు సమ్మె చేపట్టారు. థియేటర్ల యజమానుల సంఘం సహా సినీ రంగానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆ కమిటీలో ఉంటారని ఆ సంఘం నాయకుడు అభిరామి రామనాథన్‌ ప్రకటించారు. ఆ సందర్భంగా రూ. 120 టికెట్టు ధరను రూ.153కు విక్రయించారు. సినిమా టికెట్ల ధరను పెంచడం పట్ల సినీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ భారాన్ని మోయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్నును పూర్తిగా ఎత్తివేయాలని థియేటర్ల యజమానులు పట్టుబట్టారు. అయితే జీఎస్టీ పుణ్యమా అని రూ.118కు, టికెట్ ధర రూ106కు, రూ.100 టికెట్ రూ.90 నుండి టికెట్ రూపాయలను 50 కి తగ్గించుకుంటూ వచ్చారు. ఆ కారణంగా శుక్రవారం ఉదయం నుంచి సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల సమ్మె అనంతరం నగరంలోని సినీ థియేటర్లలో మళ్లీ ప్రేక్షకుల సందడి ప్రారంభమైంది. కళ్ల ముందు వెండితెరపై బొమ్మలు కదలాడక లబోదిబోమన్న సినీ ప్రేక్షకులు శుక్రవారం ఉదయాన్నే ఉరుకుల పరుగులతో థియేటర్లకు వద్దకు పరుగులుపెట్టారు. టికెట్ ధరను తగ్గించడం సుమారు రూ.80 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు థియేటర్ల యజమానుల సంఘ నాయకులు పేర్కొన్నారు.