అమిత్ షా గో బ్యాక్..

SMTV Desk 2018-05-11 15:13:27  AMIT SHAHS CONVOY PROTEST, BJP NATIONAL PRESIDENT, AMIT SHAH IN TIRUPATI, BJP, TDP

తిరుపతి, మే 11 : ఏపీలో ప్రస్తుత ఆధికార పార్టీ టీడీపీ, బీజేపీ పార్టీ ల యవ్వారం ఉప్పు నిప్పులా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై రాజకీయ నాయకులూ, ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. కాగా ఈ రోజు తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఘోర అవమానం జరిగింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్‌ నినాదాలు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేశారు. నిరసనల నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారుల్ని చెదరగొట్టి షా కాన్వాయ్‌ని పంపించేశారు. ఈ ఘటనపై ఘటనపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందించారు. ‘‘నోటికొచ్చినట్లు మాట్లాడి మోసం చేశారు కాబట్టే దాడి జరిగింది. ఒక్క తిరుపతిలోనేకాదు బీజేపీకి దేశమంతా ఇదే పరిస్థితి వస్తుంది. వారు ఆ వేంకటేశ్వరుడి ఆగ్రహం చవిచూడక తప్పదు’’అని వ్యాఖ్యానించారు. అలిపిరిలో అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి చేసిన టీడీపీ శ్రేణుల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణకు అందరూ బద్ధులై ఉండాలని, తెలిసీ తెలియకుండా ప్రవర్తించి, పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.