అన్నయ్య తర్వాత రవితేజనే చూశా.. : పవన్

SMTV Desk 2018-05-11 13:07:11  nela ticket, pawan kalyan, raviteja, audio launch.

హైదరాబాద్, మే 11 : మాస్ మహారాజా రవితేజ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా "నేల టిక్కెట్టు". ఈ సినిమా ఆడియో లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్.. పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "నాకు ఇష్టమైన వ్యక్తి రవితేజ కోసం నేను ఈ వేడుకలకు వచ్చాను. నేను యాక్టర్ కాకముందు.. రవితేజ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేయడం చూశాను. అన్నయ్య తర్వాత అంత దగ్గరగా చూసిన వ్యక్తి ఆయనే. "ఆజ్ కా గుండా రాజ్" రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తున్న టైంలో రవితేజను ఫస్ట్‌టైం చూశాను. ఆయనకు గుర్తుంటుందో లేదో తెలియదు.. నేను అప్పుడు యాక్టింగ్ లో లేను కాబట్టి గుర్తుండకపోవచ్చు" అన్నారు. అంతేకాకుండా "ఆయన నటన వెనుక తపన, కష్టం, కృషి చెప్పలేని కష్టాలతో కూడిన బాధ, ఎంతో ఉంది. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే.. గుండెల్లో ఎంతో కొంత బాధ, ఆవేదన లేకపోతే హాస్యం రాదు.. అందుకే నాకు రవితేజ అంటే చాలా ఇష్టం, గౌరవం. ఇంత సిగ్గు లేకుండా ఎలా యాక్ట్ చేస్తారు. ఎంత మంది జనం ఉన్నా.. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా.. సిగ్గు విడిచి నటిస్తారు. నేనైతే అలా నటించలేను అక్కడి నుండి పారిపోతాను. అందుకే ఆయనంటే స్ఫూర్తి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని వెల్లడించారు.