హాట్ టాపిక్ అవుతున్న నటి పూనమ్ ట్వీట్స్..!!

SMTV Desk 2018-05-11 12:31:45  Punam cour, twitter comments, director, film nagar.

హైదరాబాద్, మే 11 : సినీ న‌టి పూన‌మ్ కౌర్.. కొన్ని ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూ, అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన ట్విట‌ర్‌లో ఓ ద‌ర్శ‌కుడిని ఉద్దేశించి ప‌రోక్షంగా చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి. కాని దర్శకుడు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. "ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ వున్నాడు. సినిమాలనే కాదు.. మనుషులను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు .. అందులో భాగంగా మాయ చేశాడు కూడా. ఆ విషయంపై వివరణ అడిగితే.. ఏమీ ఎరుగనట్టుగా నటించాడు. ఆయనకి సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో వుండాలని కోరుకుంటాడు" అని చెప్పుకొచ్చింది. దాంతో పూనమ్ ఎవరి గురించి ఇలా మాట్లాడి ఉంటుంది? ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.