అనుకోని అతిథి కేసీఆర్.. పెళ్లి బృందం షాక్

SMTV Desk 2018-05-10 18:53:03  Cm Kcr, attended Marriage, Karimnagar tour

కరీంనగర్, మే 10: కరీంనగర్ జిల్లా కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది. జిల్లాలోని హుజురాబాద్ లో ఈరోజు ఉదయం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కేసీఆర్ తన పర్యటనలో భాగంగా శంకరపట్నం మండలంలోని తడికల్ గ్రామం మీదుగా వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. కేసీఆర్ వెంటనే తన వాహనాన్ని ఆపి నడచుకుంటూ నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు..అనుకోని అతిథి కేసీఆర్ ను చూసి పెళ్లి బృదం ఆశ్శార్యానికి గురయ్యారు.