బ్యాగులో భద్రంగా..!

SMTV Desk 2018-05-10 17:31:13  hand bags, hand bag material, credit cards, debit cards,

హైదరాబాద్, మే 10 : ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు కొన్ని అవసరమైన వస్తువులు మర్చిపోతాం. ముఖ్యంగా చాలామంది ఆఫీసుకొచ్చిన తర్వాత మరిచిపోయిన వస్తువులు గుర్తు తెచ్చుకొని బాధపడతారు. అవనే కాదు... మన బ్యాగులో నిత్యం ఉండాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి. >> క్రెడిట్‌ కార్డూ, డెబిట్‌కార్డూ, లైసెన్స్‌ మరేవయినా ఇతరత్రా కార్డులు పెట్టుకోవడానికి వీలుగా ఓ చిన్నవాలెట్‌ని విడిగా ఉంచుకోండి. ఈ కార్డులు బ్యాగులో అన్ని వస్తువులతో కలిసిపోతే విరిగిపోతాయి. వీటికోసం ప్రత్యేకించి వాలెట్‌ని వాడితే పాడవకుండా ఉంటాయి. వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. >> వీలుంటే ఓ చిన్న హ్యాండ్‌ శానిటైజర్‌ని పెట్టుకోండి. వర్షాకాలం త్వరగా సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే కాలం కాబట్టి ఈ జాగ్రత్త జ్వరం, జలుబు లాంటివి రాకుండా చేస్తుంది. >> అనుకోకుండా తలపగిలిపోయే తలనొప్పి...! ఎక్కువ సేపు కార్యాలయంలో గడపడం వల్ల భుజాలూ, మెడనొప్పి. మాత్ర కన్నా బ్యాగులో చిన్న పెయిన్‌ బామ్‌ను పెట్టుకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. >> అత్యవసర సమయంలో మీకూ లేదా మీ స్నేహితురాలికి ఉపయోగపడుతుంది శానిటరీ నాప్‌కిన్‌. కాబట్టి దాన్ని చక్కగా కాగితంలోకానీ, కవర్‌లోకానీ చుట్టి అడుగున పెట్టండి.