ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాటం: అఖిలప్రియ

SMTV Desk 2018-05-10 17:06:01  Ap special status, demand, Tdp, Minister Akhilapriya

కర్నూలు, మే 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పోరాటం చేస్తున్న పార్టీ తెలుగుదేశమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పేరుతో కొంతమంది దొంగ దీక్షలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలకు అండగా చంద్రబాబు ఉన్నారని ఆమె అన్నారు. జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో పాల్గొన్న ఆమె ప్రసంగిస్తూ అభివృద్ధిలో రాయలసీమ పరుగులు పెడుతోందన్నారు.