దేశంలోనే తెలంగాణా నెంబర్ వన్: మహమూద్ అలీ

SMTV Desk 2018-05-10 16:28:08  Rythu bandh, started deputy cm Mahmood ali, Nalgonda

నల్లగొండ, మే 10: దేశంలోనే తెలంగాణా నెంబర్ వన్ రాష్ట్రం అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం యాడ్గార్‌పల్లిలో గురువారం ఆయన రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు రైతుల మీద ఎనలేని ప్రేమ ఉందని కొనియాడారు. రైతుబంధు కోసం నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లోనూ నగదును అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. పకడ్బందీగా పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసినట్లు మహమూద్‌అలీ తెలిపారు.